Home  »  TV News  »  Podharillu: నారాయణపై ప్రాణాంతక దాడి చేసిన ఆది.. మహాలక్ష్మి పరిస్థితి ఏంటి?

Updated : Mar 31, 2026


స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -81 లో......మాధవకి మహా ఫోన్ చేస్తుంది. నాతో పాటు మీ నాన్న కూడా వస్తున్నాడు.. నాకు ఇబ్బందిగా ఉందని మహా అనగానే మాధవ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి నువ్వు వెళ్ళకని అంటాడు. అవసరం లేదు నేను వెళ్తానని నారాయణ అంటాడు. ఆ తర్వాత నాన్న వెళ్తే ఏంట్రా మనం మహాలక్ష్మి ఎలా వెళ్లి వస్తుందోనని భయపడుతున్నాం కదా నాన్న ఉంటే సేఫ్టీగా తీసుకొని వస్తాడని చక్రితో మాధవ అనగానే అయితే తను వచ్చేవరకు నేను రిలాక్స్ గా ఉంటానని చక్రి అంటాడు. ఆ తర్వాత కేశవని ఇంట్లో ఇరికించిందని కేశవ కోపంగా శైలుని ఇంట్లో వాళ్ళ ముందు ఇరికిస్తాడు. ఫోన్ చేసి నేను కాలేజీ నుండి మాట్లాడుతున్న మీ అమ్మాయి చదవడం లేదు ఫోన్ రీల్స్ అని టైమ్ పాస్ చేస్తుందని అంటాడు. దాంతో నువ్వు కాలేజీలో ఏం చదవడం లేదంట మీ సర్ కాల్ చేసి చెప్పారని వాళ్ళ నాన్న శైలుని అడుగుతాడు. 

దాంతో కేశవకి కాల్ చేస్తుంది శైలు. తనని రిక్వెస్ట్ చేసి ఆ ఫోన్ వేరే వాళ్ళకి చెయ్యబోయ్ మీకు చేసామని చెప్పండి అని కేశవని శైలు రిక్వెస్ట్ చేయగా శైలు చెప్పమన్నట్లే చెప్తాడు. ఆ తర్వాత నారాయణ మధ్య మధ్యలో కార్ ఆపమంటూ మహాకి బిర్యానీ తీసుకొని రమ్మని అంటాడు. ఆ తర్వాత మహాని తీసుకొని నారాయణ కాలేజీకీ వస్తాడు. నేను బయట ఉంటాను ఏదైనా సమస్య ఉంటే పిలవమని నారాయణ చెప్తాడు. మహా తన ఫ్రెండ్ తో కలిసి లోపలికి వెళ్తుంది. అక్కడ క్లర్క్ ఉండి మహాతో మాట్లాడి సర్టిఫికేట్లు గురించి మేడమ్ తో మాట్లాడమని చెప్పి బయటకు వెళ్తాడు. క్లర్క్ మహా వాళ్ళ అన్నయ్య ఆదికి ఫోన్ చేస్తాడు. మీ చెల్లి కాలేజీకీ వచ్చిందని ఆదికి క్లర్క్ చెప్తాడు. మంచి టైమ్ ఇప్పుడే లాక్కొని వచ్చి ఇంట్లో పడేస్తానని ఆది అనుకోని.. నేను వస్తున్నాను.. వచ్చేవరకు అక్కడే ఉండేలా చూడమని ఆది చెప్తాడు. దాంతో క్లర్క్ సరే అంటాడు. ఆ తర్వాత సర్టిఫికేట్లు పోయాయని ముందుగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలని.. ఆ కాపీ మాకు కావాలని అక్కడ ఒక మేడమ్ చెప్తుంది. ఏమో నాకు తెలియదని మహా అంటుంది. అబ్బా మళ్ళీ మొదటికి వచ్చిందే అని మహా డిస్సపాయింట్ అవుతుంది.

ఆ తర్వాత మహా బయటకు వస్తుంటే అప్పుడే ఆది కార్ లో వస్తాడు. నువ్వు  ఎప్పుడు కాలేజీకి వస్తావోనని వెయిట్ చేస్తున్నానని మహాతో ఆది అంటాడు. మహాని బలవంతంగా తీసుకొని వెళ్లే ప్రయత్నం చేస్తాడు ఆది. దాంతో నారాయణ అడ్డుపడుతాడు.  కాసేపు నారాయణ, ఆది మధ్యలో తోపులాట జరుగుతుంది. ఇక కార్ లో ఉన్న ఒక కత్తిని ఆది తీసుకొని నారాయణ కడుపులో పొడుస్తాడు. దాంతో ఆదిని మహా కొడుతుంది. వెంటనే నారాయణని తీసుకొని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుంది మహా. ఆ విషయం చక్రికి చెప్పాలని ఫోన్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.